Eto Vellipoindi Manasu : రమ్య, సీతాకాంత్ లు క్లోజ్ గా ఉండటం చూసిన రామలక్ష్మి..!
on Mar 16, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -353 లో... రామలక్ష్మి అన్నమాటలకి రామ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి, శ్రీలత లు వచ్చి.. ఏమైంది డల్ గా ఉన్నావని అడుగుతారు. మా మిస్ నన్ను తిట్టింది.. ఇక మా మిస్ తో మాట్లాడనని కోపంగా పైకి వెళ్ళిపోతాడు. రామ్ ఆ మిస్ ని కలవకుండా ఉంటేనే కదా బావగారు తనని చూడరని శ్రీవల్లి, శ్రీలతలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు రామలక్ష్మి అన్నమాటలు సీతాకాంత్ గుర్తుచేసుకొని బాధపడతాడు.
రామలక్ష్మి తను సీతాకాంత్ తో కఠినంగా మాట్లాడిన తీరు గుర్తుచేసుకొని నేను త్వరగా లండన్ వెళ్ళిపోవాలని అనుకుంటుంది. సీఐకి ఫోన్ చేసి నేను లండన్ వెళ్ళాలి.. ఆ రంగా కేసు ఎంత వరకు వచ్చిందని మాట్లాడుతుంది. అప్పుడే సుశీల, ఫణీంద్రలు వస్తారు. నువ్వు కఠినంగా ఉండడం ఏమో గాని పిల్లాడు బాధపడుతున్నాడని అంటారు. అవును తాతయ్య మా ఆయన తర్వాత సిరి అంటే చాలా ఇష్టం.. అలాంటిది నేనే జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నేనే బాధపడుతున్నానని రామలక్ష్మి ఫీల్ అవుతుంది. సీతాకాంత్ రామ్ దగ్గరికి వచ్చేసరికి చలి జ్వరంతో వణికిపోతుంటాడు. అది చూసి సీతాకాంత్ అమ్మ అని పిలుస్తుంటే రమ్య వస్తుంది. తనే దగ్గర ఉండి రామ్ కి టాబ్లెట్ వేసి పడుకోబెడుతుంది.
రామ్ మీ కోసం బెంగ పెట్టుకున్నాడు. జ్వరం వచ్చిందని రామలక్ష్మికి సీతాకాంత్ మెసేజ్ చేస్తాడు. మళ్ళీ డిలీట్ చేస్తాడు కానీ ఆ మెసేజ్ రామలక్ష్మి చూస్తుంది. మరుసటి రోజు వామప్ చేద్దామంటూ సీతాకాంత్ ని రమ్య గార్డెన్ లోకి తీసుకొని వెళ్తుంది. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. రామలక్ష్మిని సీతాకాంత్ చూసి ఇప్పుడు రమ్యతో క్లోజ్ గా ఉంటేనన్న రామలక్ష్మి బయటపడుతుందేమో చూడాలని అనుకుంటాడు. రమ్య, సీతాకాంత్ లని చూసి రామలక్ష్మి జెలస్ ఫీల్ అవడం శ్రీలత, శ్రీవల్లి వాళ్ళు చూస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని రామలక్ష్మిని వాళ్ళు అడుగుతారు. రామ్ కోసమని రామలక్ష్మి సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
